USA: సంపన్నుల వేల గృహాలు అగ్నికి ఆహుతి ..! 20 h ago

featured-image

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ప్రస్తుతం కార్చిచ్చు విస్తరించడంతో అత్యంత ఖరీదైన గృహాలు, సంపన్నవర్గాలు నివసించే పాలిసాడ్స్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ అగ్ని కారణంగా 3000 ఎకరాలకు పైగా జమీను దహనమైంది, ఇది దాదాపు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపుచేసే పరిస్థితిని చేర్చింది. చాలా మంది తమ సామగ్రి, వాహనాలను వదిలేసి ప్రాణాలను కాపాడుకోనేందుకు తరలివెళ్లారు.

కార్చిచ్చు ప్రభావిత ప్రాంతంలో పొగ కమ్మేసింది. ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడ కొండలపై రహదారులు ఇరుగ్గా ఉంటాయి. గాలులు కూడా అత్యంత వేగంగా వీచడంతో మంటలు విస్తరించడానికి మరింత కారణమవుతున్నాయి, రాత్రి వేళల్లో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ స్పందిస్తూ, "చాలా నిర్మాణాలు కాలిపోయాయి. మరికొన్నిచోట్ల కార్చిచ్చులు పుట్టొచ్చని అగ్నిమాపక అధికారుల అంచనా వేశారు." లాస్ ఏంజెల్స్ అగ్నిమాపక అధికారి క్రిస్టీన్ క్రాన్లీ ప్రకారం, ఇప్పటివరకు 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పు ఉన్నట్లు లాస్ ఏంజెల్స్ అగ్నిమాక అధికారి క్రిస్టీన్ క్రాన్లీ తెలిపారు.

బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫైర్ అలర్ట్ లెవల్స్ ను పెంచారు. సుమారు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక ఇబ్బందిపడుతున్నారు. మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు.

హాలీవుడ్ స్టార్లు టామ్ హాంక్స్, రీస్ విథర్స్పూన్, స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్నలాంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లువెల్లడించారు. మరికొందరి ఇళ్లు కూడా అగ్నికీలలకు సమీపంలో ఉన్నట్లు వివరించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. అక్కడి ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో తన బృందం స్థానిక అధికారులతో అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదనంగా, ఫైర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ గ్రాంట్ విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD